WSO Trust- పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం
We Shall Overcome (WSO) Trust ఉద్దేశాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా, WSO Trust Core Group అనుమతితో శ్రీమతి దేవిక గారి ఆధ్వర్యంలోని SITA Women Welfare Associationకు ఆగస్ట్, 2026 మొదటి వారంలో ₹30,000/- ఆర్థిక సహాయం అందజేయడమైనది.
ఈ సహాయంతో కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, కందుగుల గ్రామంలోని సుమారు 870 కుటుంబాలకు చేతి సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందుగా చాటింపు నిర్వహించడంతో సుమారు 250 మంది గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సంచుల వల్ల కలిగే పర్యావరణ నష్టాలను వివరిస్తూ, వాటికి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను వినియోగించాల్సిన అవసరాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమం అనంతరం గ్రామస్థులు గుడ్డ సంచులను ను వెంటనే వినియోగించడం ప్రారంభించడమే కాకుండా, తమ వినియోగాన్ని తెలియజేస్తూ ఫోన్ కాల్స్ మరియు ఫోటోలు పంపడం విశేషం. ప్రస్తుతం గ్రామంలోని 870 ఇళ్లకు చేరిన ఈ సంచులను ప్రజలు క్రమంగా వినియోగిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరి భాగస్వామ్యం- మనందరి మేలైన భవిష్యత్తు ~ We Shall Overcome Trust.????