విద్యకు చేయూత — ఒక మంచి భవిష్యత్తుకు బాట
విద్య అనేది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను మార్చగల శక్తివంతమైన సాధనం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన చదువును కొనసాగించేందుకు సహాయం కోరిన S. Sharon Priscilla, D/o Selva St. Francis Junior College, Secunderabad లో MEC 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.
ఆమె విద్యకు తోడ్పాటుగా, WSO Core team అనుమతితో 30.08.2026 నాడు ఉదయం We Shall Overcome Trust తరఫున ₹30,000/- ఆర్థిక సహాయాన్ని అందించేయడమైనది.
ఈ చిన్న సహాయం ఆమె చదువు కొనసాగించడానికి, తన లక్ష్యాలను చేరుకోవడానికి, భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.
ఒక విద్యార్థి చదువుకు మనం అందించే చేయూత…
ఒక జీవితానికి కొత్త దిశను చూపించగలదు.
ఈ కార్యక్రమంలో శ్రీ రావుల వెంకటేశ్వరరావు, శ్రీ కట్టా విక్రమాదిత్య, శ్రీమతి లవ్లీ, శ్రీ అశ్విన్ శర్మ, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీ మిస్రీ, శ్రీ వెంకట్ రెడ్డి, శ్రీ గడ్డం రవి, శ్రీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
“Empowering lives through education and compassion.” ~ We Shall Overcome Trust.