Latest Posts:

WSO TRUST Provides ₹25,000 Financial Assistance to Support Paralysis Treatment and Family Needs
WSO TRUST Provides ₹25,000 Financial Assistance to Support Paralysis Treatment and Family Needs

We Shall Overcome Trust ఆధ్వర్యంలో, కరీంనగర్‌కు చెందిన శ్రీ ఎ. హరిబాలకృష్ణ గారికి ₹ 25,000/-ల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

శ్రీ హరిబాలకృష్ణ గారు గతంలో VITS కళాశాలలో పనిచేసేవారు. సుమారు ఒక సంవత్సరం క్రితం ఆయనకు పక్షవాతం (Paralytic Stroke) రావడంతో కుడి చేయి, కాలు సరిగా పనిచేయకపోవడంతో ప్రస్తుతం ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడటంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు చదువుకుంటుండటంతో, వారి విద్యా ఖర్చులతో పాటు తన వైద్య ఖర్చులు మరియు కుటుంబ జీవన వ్యయాలను నిర్వహించడం కష్టంగా మారింది.

ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఆయనకు కొంత ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో WSO core team అనుమతితో We Shall Overcome Trust తరఫున ₹25,000/- (రూపాయలు ఇరవై ఐదు వేల మాత్రమే) సహాయంగా అందించడం జరిగింది.

ఈ సహాయం ఆయన వైద్య అవసరాలకు, కుటుంబ జీవనానికి మరియు కుమార్తెల విద్య కొనసాగింపుకు కొంత తోడ్పాటుగా నిలుస్తుందని ఆశిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో శ్రీయుత రావుల శశిధర్, గద్దె సత్యనారాయణ, లబ్ధిదారు తండ్రి శ్రీ గుగ్గిళ్ల రవీందర్, మంచాల మహేష్, బొడ్ల రమేష్, మండి శ్రీనివాస్, LIC శ్రీనివాస్, మాడిశెట్టి కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

We Shall Overcome Trust
“Together, We Shall Overcome.”


Author: adminwso@gmail.com
01.09.2026, 06:43
Category: Health
Comments: 0
Views: 61
Share

Comments (0)
There are no comments yet.

Leave A Comment