Latest Posts:

WSO TRUST Provides ₹25,000 Financial Assistance for a Child’s Medical Treatment
WSO TRUST Provides ₹25,000 Financial Assistance for a Child’s Medical Treatment

We Shall Overcome Trust ఆధ్వర్యంలో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన శ్రీ గుగ్గిళ్ల రవీందర్ గారి కుమార్తెకు వైద్య చికిత్స నిమిత్తం ₹ 25,000/- ఆర్థిక సహాయం అందించబడింది.

ఆ చిన్నారి Muscular Dystrophyతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు అవసరమైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ శ్రీ రవీందర్ గారు మన WSO ట్రస్ట్‌ను ఆశ్రయించారు. కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చిన్నారి మెరుగైన భవిష్యత్తు కోసం WSO core team ఆమోదంతో We Shall Overcome Trust తరఫున ₹25,000/-(రూపాయలు ఇరవై ఐదు వేల మాత్రమే) ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది.

ఈ సహాయం ఆ కుటుంబానికి కొంత ఉపశమనం కలిగించి, చిన్నారి వైద్య చికిత్సకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో శ్రీయుత రావుల శశిధర్, గద్దె సత్యనారాయణ, లబ్ధిదారు తండ్రి శ్రీ గుగ్గిళ్ల రవీందర్, మంచాల మహేష్, బొడ్ల రమేష్, మండి శ్రీనివాస్, LIC శ్రీనివాస్, మాడిశెట్టి కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

“ఒక చిన్న సహాయం… ఒక కుటుంబానికి ఆశను, ఒక చిన్నారికి భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇస్తుంది.”

— We Shall Overcome Trust.????


Author: adminwso@gmail.com
01.09.2026, 06:41
Category: Health
Comments: 0
Views: 43
Share

Comments (0)
There are no comments yet.

Leave A Comment