ఓ అనిర్వచనీయ ఆత్మానందం. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^ WE SHALL OVERCOME ట్రస్టు వారం క్రితం పర్యావరణంలో భాగంగా పాఖాల బ్లాక్, గూడూరు/కొత్తగూడ,మహబూబాబాద్ అడవుల్లో అడవి జంతువుల కోసం నీటితొట్టెలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డి ఎఫ్ ఓ శ్రీ కృష్ణగౌడ్ గారు, ఎఫ్ ఆర్ ఓ శ్రీ లక్ష్మీనారాయణ గారు, సెక్షన్ ఆఫీసర్ శ్రీ కోటేశ్వర్ గారు మరియు ఇతర అటవీ అధికారులు దోహదపడ్డారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వాటి సందర్శనకు వెళ్ళినప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అదొక అనిర్వచనీయమైన ఆత్మతృప్తి. ఈ భూమిమీదికి మనం ఆలస్యంగా వచ్చాం. అన్ని జీవుల కన్నా చివరన వచ్చాం. కానీ, అన్ని జీవుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాం. తద్వారా మన పర్యావరణాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్నాం. అది కూడదు అనే ఉద్దేశంతో మా సంస్థ ముందుకు వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసేందుకు మేం చేయి చేయి కలిపాం..... నడుంబిగించాం...... అడుగు ముందుకేసాం ...... ఈ సమాజం, పర్యావరణం మనది. మన సొంతం. రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే.... మీరూ మాతో కలిసి నడవండి. మాతో చేతులు కలపండి. కలకాలం నిలబడే మనదైన సుందర వసుధైక కుటుంబాన్ని సాధిద్దాం...... మన భవిష్యత్ తరాలకు చల్లగా, పచ్చగా బతికే అవకాశాన్ని కల్పిద్దాం.
Leave a comment