Blog Details

కుటుంబంలో 8 మందిని కోల్పోయిన ఖురేషీని కనుక్కుని, అతని దీనస్థితికి ఆసరా ఇచ్చిన WSOTRUST.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని అలీనగర్‌ ప్యాలెస్‌వ్యూ కాలనీకి చెందిన మహమ్మద్‌ తాహేర్‌ ఖురేషీ(62), మహానగరాన్ని 14.10.2020 నాడు కుదిపేసిన వరదల్లో

తన కుటుంబంలో ఇద్దరు కుమారులు, ముగ్గురు కోడళ్లు, మనవడు, మనవరాలు, సోదరుడు మొత్తం 8 మందిని తన కళ్లముందే కోల్పోయాడు. తానూ వరదల్లో కొట్టుకుపోయి ముల్లకంపల్లో చిక్కుకుని బయటపడ్డాడు.

ఫలక్‌నుమా బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేసిన ఖురేషీ అనారోగ్యంతో 2016లో పదవీ విరమణ తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు రూ.1600 పింఛనుతో జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్యంతో ఆయన భార్య చనిపోయారు. తల్లిదండ్రులులేని ఇద్దరు మనవళ్ల బాధ్యతను తానే తీసుకున్నారు.

మిగిలిన కొడుకూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఈయన దయనీయస్థితి గురించి 14.10.2021 నాడు ఈనాడు నెట్ లో వచ్చిన వార్తను గురించి శ్రీ వేముల శ్రీనివాసులుగారు వాకబు చేయమనగా, మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీ నరసింహ గారి ద్వారా పూర్తి సమాచారము సేకరించడం

జరిగింది.

ఈరోజు ఉదయం శ్రీ వేముల శ్రీనివాసులు, Addl.IG, Stamps and Registration Department,శ్రీ రావుల శశిధర్, JC, Commercial Taxes Department , శ్రీ మేడికాయల సునీల్ , Advocate & Treasurer, WSOTRUST గార్లు WSOTRUST తరఫున శ్రీ మహమ్మద్‌ తాహేర్‌ ఖురేషీగారికి

*రూ॥ 20,000/-* చెక్ అందించడం జరిగింది.

మరో సభ్యులు శ్రీ రాధాకృష్ణ గారు తన సంస్థ BASS తరఫున నెలకు సరిపడా సరకులు(విలువ రూ. 2,500/-)అందించడం జరిగింది.

ఈ సందర్భంగా

మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీ నరసింహగారికి, శ్రీ మహమ్మద్‌ తాహేర్‌ ఖురేషీగారికి, eenadu.net వారికి WSOTRUST తరఫున కృతజ్ఞతలు.

???? WSOTRUST ????

Comments (0)

    There are no comments yet.

Leave a comment