Blog Details

ఈ చల్లనితల్లి కూరాకుల కాంతమ్మ W/O కీ.శే.సుఖదాస్, మాదాపురం, మహబూబాబాద్. ప్రతీ సంవత్సరం వచ్చినట్టుగానే, ఈ సంవత్సరమూ పెయింటెడ్ స్టాక్స్ మాదాపురం, మహబూబాబాద్ వచ్చేసాయి. గూళ్ళు పెట్టుకున్నాయి. గుడ్లుపెట్టి పొదిగాయి. పిల్లలయ్యాయి. దాదాపు పది రోజుల క్రితం తన ఇంటి పెరట్లో గూడు నుండి కింద పడ్డ బుల్లి స్టాక్ ను రక్షిస్తోంది. పక్షి అరుపులు, రెట్టల వాసన వలన చాలామంది పక్షులను వెళ్ళగొడితే, ఈ తల్లి మాత్రం తన చింత పంట నష్టపోయినా, తన బాధ్యతగా వాటిని వెళ్ళగొట్టలేదు. సరికదా....గూడు నుండి పడిపోయిన పక్షిపిల్లకు సీరెంజితో నీళ్ళు పడుతూ, చేప పిల్లలను ఆహారంగా ఇస్తూ కాపాడుతోంది. మానవత్వం ఆమెలో నిండుగా కనిపిస్తోంది కదూ!???? ఎప్పుడన్నా వీలైతే మీరు,మీ పిల్లలు పక్షులు గుంపుగా ఉండే ప్రదేశాలు తిరిగి రండి.....మనసుకెంతో ఆనందం. అవి మనతో మాట్లాడకున్నా, రామునికి జటాయువు చేసినట్టుగా కనిపించే సాయం చేయకపోయినా, ప్రకృతిలో భాగమై కనిపించని సాయాన్ని ఎంతగానో చేస్తుంటాయి. మన తరఫున అక్కడక్కడా చల్లనితల్లి కాంతమ్మలాంటోళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. వారికీ,వాటికీ మనస్పూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ.....

Comments (0)

    There are no comments yet.

Leave a comment