దయచేసి పూర్తిగా చదవండి.
————————————
WE SHALL OVERCOME అనే కుటుంబం 2014 సంవత్సరంలో ఒక వాట్సాప్ గ్రూప్ గా మొదలైంది. అప్పుడు కేవలం 29 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. రాను రాను 81 మందికి చేరింది. ఈ సభ్యులందరూ తలా రెండు వేల నుండి ఐదు వేల వరకు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు లేదా అవసరం వచ్చినపుడు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు. కొంతమంది సభ్యులు తమ యొక్క సంబంధీకుల నుండి కూడా డబ్బులు సేకరించి అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరిగేది.
WE SHALL OVERCOME ముఖ్య ఉద్దేశం సమాజానికి మద్దతుగా ఉండడం.

మనం సమాజంలో అనేక రకాల బాధితులను కలుస్తుంటాం, వారి బాధలు విన్నప్పుడు మన మనసు కరుగుతుంది. ఏదో కొంత సాయం చేయాలనిపిస్తుంది. కానీ,
మన జేబులు చూసుకుంటే సరిపడా డబ్బు కనిపించకపోవచ్చు… అదే పది మంది కలిస్తే వారి అవసరం తీర్చడం లేదా కష్టం తొలగించడం గాని చేయగలుగుతాం.
అదే ఉద్దేశ్యంతో ఈ గ్రూపు ఏర్పడింది.

ఈ వాట్సాప్ గ్రూపులో కేవలం సహాయం అనే విషయం కాకుండా కొన్ని ప్రత్యేక అంశాల మీద చర్చ కూడా జరుగుతుంది. తద్వారా సమాజం పట్ల అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం జరుగుతుంది.
ఈ విధంగా కాలం గడుస్తున్న కొద్దీ ఒక నాలుగు స్వచ్ఛంద సంస్థలకు, పదికి పైగా వ్యక్తులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపుగా పదిహేను లక్షల రూపాయలకు పైగా మేము ఈ రకంగా సహాయం అందించగలిగాం. ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఉన్న “ఆశాజ్యోతి” అనే సంస్థకొక్కదానికే అధికంగా దాదాపు 10 లక్షల పైగా ధన సాయం చేయడం జరిగింది. ఈ బాధ్యతను మా గ్రూపు సభ్యురాలైన శ్రీమతి రేణుక, చెన్నై గారు వహించారు.
ఈ విధంగా డబ్బుల సేకరణ చేయడం అనేది నిరంతరంగా జరుగుతున్నా మనం అనుకున్న ఆశయాల అందుకోలేకపోతున్నామనే ఉద్దేశంతో 2018 సంవత్సరంలో ఒక చిన్న ఆలోచన కలిగింది. ప్రతిసారి ఎవరైనా చేయి చాచినప్పుడు గాని, కష్టం ఉందని తెలిసినప్పుడు గాని డబ్బుల గురించి అడగాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు, డబ్బుల గురించి వెతుక్కుంటూ ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ‘కార్పస్ ఫండ్’ ఏర్పాటు చేద్దామని, దాని మీద వచ్చిన వడ్డీని ప్రజల్లో అవసరమైన వ్యక్తులకు పంచాలనే ఉద్దేశంతో “వియ్ షల్ ఓవర్ కం” ఒక ట్రస్ట్ గా 2018 మార్చి లో రూపొందింది.

ఈ ట్రస్ట్ కు ప్రెసిడెంట్ గా శ్రీ మహేష్, జనరల్ సెక్రెటరీగా శ్రీమతి అపర్ణ మరియు ట్రెజరర్ గా సునీల్ కుమార్ (అడ్వకేట్) గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరేకాక హరి సతీష్, గుండా ప్రవీణ్ లతో బాటు ఆరుగురు ట్రస్టీలు కూడా ఉన్నారు.
ఈ ట్రస్ట్ లో సభ్యులుగా సింగం నరేందర్, కృష్ణ, పద్మావతి, బొడ్ల రమేష్ తదితరులు ఉన్నారు.

WSO కు పునాదులుగా వేముల శ్రీనివాసులు గారు, రావుల శశిధర్, హైదరాబాద్, బొడ్ల రమేష్, కరీంనగర్, శ్రీధర్, శ్రీమతి రేణుక, చెన్నై, కిషోర్, కరీంనగర్, రాజగోపాల్ రెడ్డి, పెన్మత్స రామచంద్ర రాజు, రావుల వెంకటేశ్వరరావు, హైదరాబాద్,  శ్రీమతి రేవతి గారు, వరంగల్, శశిధర్ రెడ్డి, భువనగిరి, చంద్రశేఖర్, దిలీప్ పంజవానీ, శ్రీమతి హర్షిణి, రాహుల్, విక్రమ్, మురళీ, హైదరాబాద్ మొదలైన ప్రముఖులు అనేక రంగాల నుండి మరియు ముంబై, నల్గొండ, గుంటూరు లాంటి అనేక ప్రాంతాల నుండి ఉన్నారు.

ఇక భవిష్యత్తు గురించి చెప్తే WSO డబ్బుల గురించి వెతుక్కోకుండా ఉండేందుకు కనీసం ఒక కోటి రూపాయల మహా నిధిని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఈ కోటి రూపాయల నిధిని ఏదేని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనీసం 50 వేల రూపాయలు నెలకు వడ్డీ గా వస్తుంది.
ఆ 50 వేల రూపాయలను అవసరం ఉన్న వ్యక్తులకు అందించవచ్చు. ఇవ్వే కాకుండా ప్రతీ సంవత్సరం వచ్చిన విరాళాలను కూడా సహాయానికి ఉపయోగించడం జరుగుతుంది.

అవసరం ఉన్న వ్యక్తులు మీకు తెలిసిన వారు కానీ, సభ్యులకు తెలిసినవారు కానీ, వార్త పత్రికల ద్వారా తెలిసిన వారు కానీ కావచ్చు.

ఈ WSO కు మీరు చేసే సహాయం కేవలం 500 రూపాయలు అని అనుకుందాం. ఇలా 500 రూపాయలు లేదా 1000 రూపాయలు 20 వేల మంది గాని పదివేల మంది గాని ఇస్తే కోటి రూపాయలు తయారైపోతాయి.
చిన్న చిన్న నీటి బొట్టు కలిసి ఒక సముద్రం ఐనట్టు ఐదైదు వందల రూపాయలు కలిపితే సులభంగా కోటి రూపాయలు తయారైపోతాయి.

ఇప్పుడు చెప్పండి మన దగ్గరికి ఎవరైనా చేయిచాచి వచ్చినప్పుడు, మనకు సంతృప్తి కలిగేంత మేర వారికి సాయం చేయగలుగుతాం కదా…!

ఇటీవల హరీష్ అనే ఒక అబ్బాయి నాగపూర్ ఎన్ఐటీ లో సీటు సంపాదించుకున్నాడు. అయితే ఫీజు కట్టడానికి డబ్బు లేకుంటే పేపర్ లో ఆ వార్త ప్రచురితమైంది. దాన్ని చూసి ఒక WSO సభ్యుడు గ్రూప్ లో పోస్ట్ చేసాడు. మేము విచారించి అది నిజమేనని నిర్ధారిం చుకున్న తర్వాత అతనికి 60 వేల రూపాయల వరకు సహాయం అందించడం జరిగింది. తద్వారా అబ్బాయి ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం, ఆనందంగా తన విద్యా సంవత్సరం మొదలు పెట్టడం జరిగిపోయింది.
ఈ విధంగా మనం, మన చుట్టూ ఉన్న సమాజంలో అవసరం ఉన్న వ్యక్తులకు సహాయం చేయగలం.
మనం అనుకుంటే ఇదో పెద్ద విషయం కాదు.

ఏదో WSO అనేది కొంత మందికి సంబంధించిన ట్రస్టు అనే భావన మీలో నుండి తీసేయండి.

మీరు, మేము… మనందరం కలిస్తే WSO…!!
కాబట్టి మీరు అందరూ WSO ను మరింత బలపరుస్తారని, మా ఆలోచనలను అర్థం చేసుకుని చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము.

పూర్తి పాఠం చదివినందుకు ధన్యవాదాలు.

మన సమాజాన్ని మనమే తీర్చి దిద్దుకుందాం…….
అందుకు అందరం భాగస్వాములు అవుదాం.

అందుకు అందరూ ఆహ్వానితులే!